Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సూర్యాపేటరూరల్
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డు రాయినిగూడెం గ్రామంలో గ్యాస్ ధరను తగ్గించాలని కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలను పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నల్లమేకల ఉప్పమ్మ, జ్యోతి, రమణ, లక్ష్మమ్మ, పుల్లమ్మ, పద్మ,పున్నమ్మ,తదితరులు పాల్గొన్నారు.
మునగాల : పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని కోరుతూ సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా రస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, మేదర మెట్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకటరెడ్డి, పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య, మండల కార్య దర్శి వర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, షేక్ సైదా,దేశి రెడ్డి స్టాలిన్‌రెడ్డి, ఆరెరామ కష్ణారెడ్డి, మండవ వెంకటాద్రి, బట్టు నాగయ్య, అనంత గురువయ్య, బోనాల మంగయ్య, మల్లారెడ్డి, శేఖర్‌రెడ్డి, నందిగామ సైదులు, వెంకన్న, మల్లయ్య, పాల్గొన్నారు.
గరిడేపల్లి : పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీిఐ(ఎం) మండల కార్యదర్శి షేక్ యాకుబ్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య, రాంబాబు, అహ్మద్, జోజి, రాము, అరవిందు, మహిళలు ఉప్పమ్మ, సాలమ్మ, సునీత, ఎల్లమ్మ, ప్రమీల, ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీిఐ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా సెంటర్లో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లావుల రాములు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకురిబాబు కంబాల శ్రీనివాస్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవారం మల్లేశ్వరి, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జడ శ్రీనివాస్ , కొప్పోజు సూర్యనారాయణ, దంతగాని సత్యనారాయణ, వీరబాబు, జక్కుల రమేష్, సత్యవతి సోమగాని వెంకన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌రూరల్ : హుజూర్నగర్ పట్టణంలోని 10వ వార్డులోని దుగ్గి అన్నపూర్ణ ఇందిరాల సురేఖ ఆధ్వర్యంలో శుక్రవారం గ్యాస్ ధరల పెంపుకు నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్ని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇందిరాల పుల్లమ్మ, సావిత్రమ్మ, అమరబోయిన వెంకటమ్మ, పచ్చిపాల వెంకట్రాములు, దేవరం భద్రమ్మ, దుగ్గి వెంకటమ్మ, రేణుక, కల్పన, కామ్మ, హుస్సేనమ్మ, ఇందిరాల కలావతి, కుమారి, వెంకటయ్య, విజయలక్ష్మీ, గూడెపు ప్రభావతి, దుర్గమÊ, ప్రియాంక, సైదమ్మ పాల్గొన్నారు.
నూతనకల్ : పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో కట్టెల పొయ్యి మీద వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ అధికారంలోకి రాకముందు 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధరలు ప్రస్తుతం 1155 వరకు పెంచారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు బత్తుల జనార్ధన్ గౌడ్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి ఎర్ర ఉపాల్ రెడ్డి దాసరి రవి బాత్కాలింగయ్య సాయి రెడ్డి వీరారెడ్డి ఉప్పల పరమేష్ బాలగాని సోమయ్య బాణాల విజయ రెడ్డి శివారెడ్డి బొత్స శీను మందడి చంద్రారెడ్డి కోసు జీవన్ కోకట్ల మహేష్ పాల్గొన్నారు.