Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఈ నెల 6న జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగే కార్మిక, కర్షక జిల్లా సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు పిలుపునిచ్చారు. శుక్ర వారం స్థానిక ఎంవిఎన్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఉన్న సంపద మొత్తం అంబానీ, ఆదానీలకు కట్టబెడుతూ కార్మికులు, కర్షకులపై మోయలేని భారం మోపుతున్నారని విమర్శించారు. కార్మిక చట్టాలను మార్చివేస్తూ నాలుగు కోడ్లు విభజించి కార్మికుల ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దేశానికి సంపదను సృష్టిస్తున్న కార్మిక వర్గానికి కనీస వేతనం రావడం లేదన్నారు.దేశానికి తిండిబెట్టే రైతన్న తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అన్న మో రామచంద్ర అని ఏడుస్తున్న పండించిన పంటకు కనీసం మద్దతు ధర కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికుల వలసలను నివారించేందుకు వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని రోజురోజుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ బడ్జెట్ ను కుధిస్తూ కూలీల నోట్లో మట్టి కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకనుగుణంగా ఉపాధి కూలీల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సుకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలోసీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబాబు, జిల్లా నాయకులు రణపంగా కృష్ణ పాల్గొన్నారు.