Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే బొల్లం
నవతెలంగాణ-కోదాడరూరల్
నిరుపేదల నడ్డి విరిచే విధంగా బీజేపీ సంస్కరణలు చేపట్టిందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల పిలుపు మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా పట్టణంలో రంగా థియేటర్ సెంటర్లో మహా ధర్నా గ్యాస్ సిలిండర్లతో నల్ల జెండాలతో భారీ నిరసన నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మహాధర్నకు నల్ల దుస్తులతో గ్యాస్ సిలిండర్ మోసుకుంటూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అర్థమయ్యే విధంగా మహా ధర్నాకు చేరుకున్నారు. అనంతరం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మోడీ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. అసత్య ప్రచారాలతో బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుతుందని తెలిపారు. ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని తెలిపారు. బీజేపీ రహిత రాష్ట్రాలు అభివృద్ధిలో ముందున్నాయన్నారు. మోడీ పాలనలో దేశం అభివృద్ధిలో వెనకకు వెళ్తోందని చెప్పారు. పేదోళ్ళ కడుపుకొడుతున్న బీజేపీకి భంగపాటు తప్పదని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి తాకాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ అంబానీలే మోడీ పాలనలో బాగుపడ్డారు. నిరుపేదల నడ్డి విరిచే సంస్కరణలు బీజేపీ తీసుకొస్తోందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. ధరలు దిగొచ్చే వరకు పోరాటం చేద్దామన్నారు. ఒకవైపు ఉజ్వల స్కీం పేరుతో మాయమాటలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు భారీగాసిలిండర్ ధరలను పెంచుతున్నది. వారిని సిలిండర్‌కు దూరం చేస్తున్నదని విమర్శించారు. ఉజ్వల స్కీం లో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళా సైతం ఈరోజు సిలిండర్‌ను కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పట్టణ కౌన్సిలర్లు, సొసైటీ చైర్మెన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, రైతు సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హుజూర్నగర్ : పెంచిన వంట గ్యాస్, నిత్యవసర సరుకులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అచ్చేదిన్నె నహిచచ్చేదిన్ ఆయా అన్నారు. వాళ్ళ జీవితాలను ఇబ్బంది చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మెన్ జక్కుల నాగేశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ దొంతగాని శ్రీనివాస్, మఠంపల్లి ఎంపీపీ పార్వతీ కొండ నాయక్, మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య మాజీ ఎంపీపీ నర్సింగ్ వెంకటేశ్వర్లు మహిళా అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మ, గుండా పని కుమారి, శిల్ప శ్రీనివాస్, పిచ్చయ్య, చెవుల కవిత, వార్డ్ కౌన్సిలర్లు, సర్పంచులు ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మహిళలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు నాయకులు లతో కలిసి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నుండి చౌరస్తా వరకు మహిళలతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించి మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి బదులు ప్రజలపై నానాభారాలు మోపుతోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువుల ధరలు పెంచి పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజిని రాజశేఖర్, మార్కెట్ చైర్మన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్, ఎంపీపీ స్నేహలత జెడ్పిటిసి దూపతి అంజలి రవీందర్, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, పట్టణ అధ్యక్షులు యాదగిరి, మండల ఉపాధ్యక్షులు కందుకూరి లక్ష్మయ్య, మరియు కౌన్సిలర్లు, నాయకులు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు తదితర మహిళలు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంపుకు నిరసనగా శుక్రవారం నేరేడుచర్ల పట్టణ అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి అధ్వర్యంలో నేరేడుచర్ల పాలక వీడు,గరిడేపల్లి, మండలాల ముఖ్య నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ దేశాన్ని అప్పుల పాలు చేసి సామాన్య ప్రజల నెత్తిపై లక్షల అప్పులు వేశారన్నారు. కేసీఆర్ త్వరలో ప్రధానమంత్రి అయి బీజేపీ అవినీతిని బయటపెడతారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ జయబాబు,నేరేడుచర్ల,పాలక వీడు,గరిడేపల్లి, బిఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు,అరిబండి సురేష్ బాబు, కృష్ణపాటి అంజి రెడ్డి,గూగులోత్ కృష్ణ నాయక్, నేరేడుచర్ల ఎంపీపీ జ్యోతి,జెడ్పీటీసీ రాపోలు నరసయ్య,గరిడేపల్లి ఎంపీపీ సుజాత, శైలజా, బిఆర్ఎస్ నాయకులు నాగండ్ల శ్రీధర్,రమేష్ బాబు, గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ,చిత్తలూరి సైదులు, సింగల్ విండో చైర్మన్లు అనంత శ్రీనివాస్ గౌడ్, ఎర్రడ్ల సత్యనారాయణ రెడ్డి,పలు గ్రామాల సర్పంచలు,ఎంపీటీసీలు,గ్రామ శాఖ అధ్యక్షులు,మహిళా నాయకులు,అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ దీపిక యుగంధర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో మహిళలతో కలిసి భారీ నిరసన కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ పేద ప్రజలపై అనేక పనుల భారం మోపుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షులు రజాక్, నూతనకల్ జడ్పిటిసి దామోదర్ రెడ్డి,ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్,డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు,పులుసు యాదగిరి,మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.