Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మఠంపల్లి
కస్తూరి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మండల వైద్యాధికారి పాన్ గోత్ చత్రునాయక్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఉన్నత మఠంపల్లి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 15 మందికి కస్తూరి ఫౌండేషన్ చైర్మెన్, కస్తూరి శ్రీచరణ్ సహకారంతో స్టడీ మెటీరియల్, మాదిరి ప్రశ్నాపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడుతూ కస్తూరి ఫౌండేషన్ గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు గుడిపాటి కోటయ్య, ఎలకపల్లి మహేష్, నవీన్, పాఠశాల ఇన్చార్జీ ప్రధానోపాధ్యాయులు శ్రీరామకృష్ణ, ఉపాధ్యాయులు నరసింహారావు, అమలారాణి, వీరస్వామి, సీతారాంరెడ్డి, విజయలక్ష్మి, శంకర్‌నాయక్, సరిత తదితరులు పాల్గొన్నారు.
గరిడేపల్లి :కస్తూరి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎంఈఓ పానుగోతు చత్రు నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని మరియు మండల పరిధిలోని గడ్డిపల్లి గ్రామంలోని జెడ్పీ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ అందచేసిన స్టడీ మెటీరియల్ మరియు మాదిరి ప్రశ్నాపత్రాలను శుక్రవారం ఆయన విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చత్రు నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గుడిపాటి కోటయ్య, ఎలకపల్లి మహేష్, నవీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం సువర్ణ, కనకయ్య, ఉపాధ్యాయులు వీరబాబు, కృష్టయ్య, చిన్నప్ప, తదితరులు పాల్గొన్నారు.