Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది
- గ్యాస్ ధర తగ్గించాలని ఆర్డీవో కార్యాలయం ముందు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ధర్నా
నవతెలంగాణ-దేవరకొండ
నిత్యవసర వస్తువుల ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సామాన్య ప్రజల మీద వంటింట్లో గ్యాస్ పిడుగు లాగా కేంద్ర ప్రభుత్వం మరో గుదిబండ మోపిందని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ఆరోపించారు. శుక్రవారం దేవరకొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ముందు కట్టెల పొయ్యి మంట పెట్టి, వంట చేస్తూ నిరసనతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంటగ్యాస్ ధరను మరోసారి పెంచి పేదోడికి కట్టెల పొయ్యిపై వంట చేసుకునే పరిస్థితిని మోడీ తీసుకొచ్చారన్నారు. మోడీ నమ్మించి మోసం చేశారన్నారు. మూడు రాష్ట్రాల ఎన్నికల అనంతరం గ్యాస్ ధర పెంచాడని ఎన్నికలకు ముందు పెంచితే మోడీని దించే వారన్నారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి, వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ గోపిరామ్కు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆర్డీవో కార్యాలయానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో పోలీసులు భారీ బందోభస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ నాగేశ్వరరావు, ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసు, కొండమల్లేపల్లి సీఐ రవీందర్ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నరసింహ, వైస్ చైర్మెన్ మహమ్మద్ రహత్ అలీ, ఎంపీపీలు నల్లగాసు జాన్‌యాదవ్, వంగాల ప్రతాపరెడ్డి, జెడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేష్‌గౌడ్, రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, దసరా నాయక్, ముత్యాల సర్వయ్య, చంద్రశేఖర్ రెడ్డి, వల్లపురెడ్డి, లోకసాని తిరుపతయ్య, చింతపల్లి సుభాష్, సరిత నరసింహయ్య, కేసాని లింగారెడ్డి, కుంభం శ్రీనివాస్‌గౌడ్, అంజిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ : దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలన పేదలకు గుదిబండలా మారిందని ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్యాస్ ధరలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. అనంతరం గ్యాస్ ధరలు తగ్గించాలని తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్, వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేశం, మాల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ దంటు జగదీశ్వర్, మండల అధ్యక్షులు తోటకూరి శంకర్, రైతుబంధు సమితి కన్వీనర్ బచ్చు రామకృష్ణ దళిత బంధు జిల్లా డైరెక్టర్ లపంగి నరసింహ, పందుల రాములు, పందుల పాండు, తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు : కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విచ్చే విధంగా గ్యాస్ ధరలు పెంచడంతో రాబోయే ఎన్నికలలో మహిళలు మోడీకి ఎసర్ పెట్టడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గ్యాస్ బండకు దండ వేసి, కట్టెల పొయ్యిపై చారు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బండ పురుషోత్తంరెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామిగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పగిల సతీష్ , చండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ జాజుల అంజయ్య గౌడ్, ఎంపీటీసీలు ఈద నిర్మల శరత్‌బాబు, బొడ్డు శ్రావణి నాగరాజుగౌడ్, పోలగోని విజయలక్ష్మి సైదులుగౌడ్, సర్పంచులు గుర్రం సత్యం, కంచి జ్యోతి ప్రసాద్, గుర్రాల పరమేష్, బొజ్జ సుజాత శీను, తదితరులు ఉన్నారు.
చండూర్ :కేంద్రప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ చండూర్ మునిసిపల్ కేంద్రంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కళ్యాణి, మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకల వెంకన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండలంఅధ్యక్షులు వెంకన్న, మునిసిపల్ పట్టణ అధ్యక్షులు భూతరాజు దశరథ,కౌన్సిలర్ కోడి వెంకన్న, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు ముడిగే ఎరన్న,కార్యకర్తలు పాల్గొన్నారు.
గట్టుప్పల్ మండల కేంద్రంలో
గట్టుప్పల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఇడం కైలాసం ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ ధరలు తగ్గించాలని మండల చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు గట్టుపల గ్రామ సర్పంచ్ కుమారి ఇడం రోజా, ఇడం కైలాసం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెరట్ పల్లి సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం, అంతంపేట సర్పంచ్ మాదగాని శంకర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గొరిగె సత్తయ్య, అంతంపేట ఎంపీటీసీ బంతిలాల్ నాయక్ మాజీ వైస్ ఎంపీపీ అవారి శ్రీనివాస్, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు బండారు చంద్రయ్య మండల కృష్ణ హనుమంతు నాయకులు పోరెడ్డి ముత్తిరెడ్డి, చరిపల్లి ఆంజనేయులు పున్న కిషోర్ రమేష్ నేత, పురుషోత్తం, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి :కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండు సెంటర్ వద్దకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై కట్టెలతో వంట చేస్తూ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, మండల రైతు బంధు కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, బీఆర్ఎస్ మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు, నాంపల్లి మాజీ ఎంపీటీసీ కోరె ప్రమీల మురళి పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఇట్టం వెంకటరెడ్డి, శీలం జగన్మోహన్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కోరె యాదయ్య, రామాంజనేయులు, సర్పంచులు మునగాల సుధాకర్‌రెడ్డి, నాగులవంచ శ్రీలత, బల్గూరి విష్ణువర్ధన్, ఎంపీటీసీలు అన్నెపాక సరిత కిరణ్, బెక్కం రమేష్, పీఏసీఎస్ డైరెక్టర్లు సపావట్ తౌరియా, బెల్లి సత్తయ్య, ఎదుల రాములు, గాదపాక రమేష్, గౌర్ కిరణ్, ఎదుళ్ళ యాదగిరి, సపావత్ సర్దార్, నగేష్, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.