Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ టీ.వినయ్కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను స ద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టీ.వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండ పట్టణం బొ ట్టుగూడలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన సం దర్శించారు. 18 సంవత్సరాలు పైబడి కంటి సమస్యలు ఉన్న వారందరూ శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కంటి చూపుకు సరిపోయే రీడింగ్ అద్దాలను అప్పటికప్పుడే ఇవ్వడం జరు గుతుందన్నారు. ప్రీస్క్రిప్షన్ అద్దాలను అందజేస్తున్నట్టు చెప్పారు. కంటి పరీక్షల కోసం వచ్చిన ప్రజలతో క్యాంపు ఏర్పాటు, నిర్వహణ, కంటి వెలుగు పరీక్షల గురించి కలెక్టర్ అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేసుకున్న వారు క్యాంపు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండల్రావు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.