Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూర్
గట్టుప్పల్ మండలంలోని తెరట్పల్లి, కమ్మగూడెం, చండూర్ మండలంలోని కొండాపురం, పుల్లెంల, నేర్మట శీర్దపల్లి గ్రామాలలో రెండవ రోజు శనివారం ఏజీ ఆడిట్ బృందం సభ్యులు సమీర్ ఆలీ, రత్నాకర్ తనిఖీ చేశారు. గ్రామాలలో ఏర్పాటుచేసిన ప్రకృతి వనాలను, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల కోసం ఖర్చు చేసిన నిధుల రికార్డులను పరిశీలించారు. అనంతరం చండూర్ ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాకోబు నాయక్, ఏపీ డి ఉపేందర్ రెడ్డి, ఎంపీఓ స్వరూప రాణి, ఏపీఓ శ్రీనివాస్, సర్పంచులు పంచాయతీ సెక్రెటరీలు, టీఏ లు ఉన్నారు.