Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
మర్రిగూడ మండలం తిరగండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీడీపీఓ లావణ్య కుమారి హాజరై మాట్లాడారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించాలని పేర్కొన్నారు. లింగ వివక్షత చూపకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేసి, మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అయితగోని జంగయ్య అంగన్వాడి టీచర్లను, ఉపాధ్యాయులను, వార్డు మెంబర్లను శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ యశోద, వాడు మెంబర్ భారతమ్మ, ప్రధానోపాధ్యాయులు రమణ, ఉపాధ్యాయులు పార్వతమ్మ, అంగన్వాడి టీచర్లు శ్రీదేవి, నిర్మల, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ :నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని కెనాల్స్ అంగన్వాడీ సెంటర్లో శనివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ గౌస్య బేగం ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రం పరిధిలోని గర్భిణీ, బాలింత, మహిళలు, చిన్నారుల తల్లులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ గౌస్య బేగం మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకు అన్నప్రాసన, అక్షరాభాష్యం మొదలగు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఉమా, శారద, సుధా, రాజేశ్వరి, అంగన్వాడి ఆయా ఆశ, స్థానిక మహిళలు పాల్గొన్నారు.