Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ మండలం గొట్టిముక్కుల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిహాసమాడుతోందని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమావత్ రమేష్‌నాయక్ ఆరోపించారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో గొట్టిముక్కుల ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. కొంతమందికి నష్టపరిహారం అందలేదని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మాకు ఎలాంటి నష్ట పరిహారం అందించకుండా ప్రాజెక్టును పోలీసు పహారులలో పనులు పూర్తి చేసుకుంటున్నారని, అడిగిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రావలసిన నష్టపరిహారాన్ని ప్రభుత్వ వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని, ప్రాజెక్టు పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్, మాతంగి జాన్, అంకూరి వంశీ, కళ్యాణ్‌నాయక్, గణేష్, తదితరులున్నారు.