Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
ఆర్టీవో అధికారులు గ్రామాల్లో , మండలాలలో జిల్లా కేంద్రాలలో దాడులు నిర్వహిస్తూ వాహనాలపైన రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ పేరుతో పట్టుబడ్డ వాహనాలపైన వేలకు వేలు కేసులు రాయడంతో వాహనాదారులు అర్ధాంతరంగా వాహనాలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో నవతెలంగాణతో ఆయన మాట్లాడుతూ జీవన ఉపాధి కోసం పేద ప్రజలు బ్యాంకులలో ఫైనాన్స్‌లో అప్పులు తెచ్చుకొని ట్రాక్టర్లు, డీసీఎంలు, టాటా ఏసీలు, ఆటోల తోపాటు పలు వాహనాలు తెచ్చుకొని నడుపుకుంటూ జీవన కొనసాగిస్తున్నారు. అటు వాహనాలు సరిగా నడవక, గిరాకు లేక అవస్థలు పడుతుంటే ఆర్టీవో అధికారులు ఎక్కడపడితే అక్కడ దాడులు నిర్వహించి వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నత అధికారులు వాహనదారులపైన ఉన్న కేసులను ఎత్తివేసి ఏళ్ల తరబడి నుండి పోలీస్ స్టేషన్లో తుప్పు పట్టిపోతున్న వాహనాలకు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వాహనదారులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.