Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ, చింతపల్లి, పీఏ. పల్లి, మండలాలకు చెందిన జీవో ఎంఎస్ నెంబర్ 58 కింద అర్హులైన 120 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. పెరిగిన సంపద పేద ప్రజలకు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. పేద ప్రజలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్న వారికి జీవో నెంబర్ 58, 59, ద్వారా హక్కు పత్రాలను అందించనున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో 484 డబల్ బెడ్రూమ్ ఇండ్లను లాటరీ పద్ధతిలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నాయకులు ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. అత్యధిక డబల్ బెడ్ రూమ్ ఇండ్లు బీజేపీ సూచించిన నాయకులకే వచ్చాయని ఆరోపించారు. ఆ పార్టీ నాయకుల మాటలు ప్రజలు నమ్మొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నరసింహ, వైస్ చైర్మెన్ రహత్ అలీ, రైతుబంధు అధ్యక్షులు సిరందాసు కృష్ణయ్య, ఉజ్జిని విద్యాసాగర్‌రావు, చంద్రశేఖర్‌రెడ్డి, పొన్నబోయిన సైదులు, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, చిత్రం ప్రదీప్, ఇలియాస్, దేవరకొండ తహసీల్దార్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ,పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన 120 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించనుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు ఉజ్జిని విద్యాసాగర్‌రావు, మండల ప్రధాన కార్యదర్శి ఉజ్జిని నరేందర్‌రావు, యువజన విభాగం మండల అధ్యక్షులు ఉజ్జిని నరసింహారావు, వింజమూరి రవి, ఉజ్జిని రఘురావు, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.