Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
మిర్యాలగూడ జిల్లాగా ఏర్పాటు చేసే వరకు అఖిలపక్ష నాయకులు విశ్రమించవద్దని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు ధూళిపాళ ధనుంజయనాయుడు, జ్వాలా వెంకటేశ్వర్లు, చేగొండి మురళి కోరారు. శనివారం నేరేడుచర్లలో వారు మాట్లాడుతూ మిర్యాలగూడ,హుజూర్నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాలు కలిపి మిర్యాలగూడకేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ పరిపాలన సౌలభ్యం సమ కూరుతుందన్నారు.జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్న మిర్యాలగూడ దురదష్టవశాత్తు నిర్లక్ష్యానికి గురైందని పారిశ్రామికంగా, విద్యా పరంగా, అన్ని హంగులు ఉన్న మిర్యాలగూడను జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. రైలు సౌకర్యంతో పాటు విస్తారమైన సాగు భూములు పరిశ్రమలు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు చిలకరాజు శ్రీను, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావులసత్యం, ఏఐవైఎఫ్ మండలాధ్యక్షుడు ఎల్లబోయిన సింహాద్రి,రైతుసంఘం మండలఅధ్యక్షుడు కత్తి శ్రీనివాస్‌రెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు రేఖ, ఉపేందర్, ఉల్లెందుల దుర్గయ్య పాల్గొన్నారు.