Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్ఎస్
దేశంలో మహిళలకు రక్షణ పట్ల,వారి హక్కుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నర్సమ్మ అన్నారు.అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8''సందర్భంగా ఆత్మకూర్ (ఎస్)మండలం పాత సూర్యాపేట గ్రామంలో సభ సామ ఉపేంద్ర అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలపై రోజు రోజుకు దాడులు హత్యలు, లైంగికదాడులు జరుగుతున్నాయని విమర్శించారు.ప్రేమ పేరుతో అశ్లీల సినిమాలు, సాహిత్యం, సీరియల్స్ లో వస్తున్న విచ్చలవిడి సంస్కృతి యువతపై రద్దుతున్నరని అన్నారు. దీని ప్రభావం తో నేటి యువత పక్కదారి పడుతుందని విమర్శించారు.తద్వారా సమాజంలో మానవతా విలువలు దిగజారి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మరియమ్మ, మమత, పున్నమ్మ, రేవతి, నాగమ్మ,రేణుక, బుచ్చువమ్మ,మంగమ్మ,సుగుణమ్మ,సంధ్య,మహేశ్వరి,పరిపూర్ణ,రామ నర్సమ్మ,ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.