Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఓరుగంటి ప్రభాకర్ కోరారు.శనివారం పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోపు గ్రామగ్రామాన క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ గడప గడపకు నాడు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి బడుగు, బలహీనవర్గాలకు ఎన్టీఆర్ అందించిన సంక్షేమ పథకాలు వంటివి ప్రజలందరికీ వివరించాలన్నారు.నాడు చంద్రబాబు విజన్‌తోనే నేడు తెలంగాణ రాష్ట్రం ధనికరాష్ట్రంగా అవతరించిందన్నారు.తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో ఆవిర్భవించిన టీడీపీ జెండా ఎంతోమంది రాజకీయంగా అవకాశం ఇచ్చిందన్నారు.ప్రజల్లో పార్టీపై నేటికీ పూర్తి నమ్మకం ఉందన్నారు.19 ఏండ్లుగా పార్టీ అధికారంలో లేనప్పటికీ నాయకులు తమ స్వార్థం కోసం పార్టీని వీడారే తప్ప నిజమైన కార్యకర్తలు మాత్రం ఇంకా టీడీపీలోనే ఉన్నారన్నారు.అనంతరం ఇటీవల నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియామకమైన ఓరుగంటి ప్రభాకర్‌ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు బయ్యా నారాయణ, చిలుకూరు మండల కన్వీనర్ సాతులూరి గురవయ్య, నడిగూడెం కన్వీనర్ గుండునాగేశ్వరరావు, వైస్‌ఎంపీపీ జనపనేని కృష్ణారావు, కొల్లునర్సయ్య, వేమూరి సురేష్, మైక్నాగుల్,వట్టికూటి సైదులు, జనార్దన్‌రెడ్డి, డాక్టర్ శంకర్, గురవయ్య, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.