Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
బడీడు పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని జనసేన సమితి వ్యవస్థాపకఅధ్యక్షులు తగుళ్ల జనార్దన్‌యాదవ్ అన్నారు.శనివారం మండలంలోని కందగట్ల గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌ను ఆయన సందర్శించి మాట్లాడారు.మన ఊరు-మన బడి కార్యక్రమానికి బడ్జెట్ పెంచాలని కోరారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలికవసతులు కల్పించాలి కోరారు.పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కోల కర్నాకర్,ముదిరాజ్, ప్రధానోపాధ్యాయులు రామాంజనేయులు, ఉపాధ్యాయులు మమత, చౌదరిరెడ్డి, విద్యార్థిసంఘాల నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.