Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోదాడరూరల్
అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో 3,4 వార్డులలో గ్రామపంచాయతీ నీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ వార్డు ప్రజలు ఆరోపించారు.ఈ మేరకు శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ... పది రోజుల నుండి నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నామన్నారు.చుట్టుపక్కల కూడా ఎక్కడ బోరింగ్ లేకపోవడంతో నీటి కోసం హారిగోసపడుతు న్నారు.అసలు వేసవికాలం కావడంతో నీటి వాడకం ఎక్కువగా ఉండటం, పశువులకు నీళ్లు పెట్టడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉందన్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్రామ ప్రధానకార్యదర్శి షేక్ సుభాని మాట్లాడుతూ డ్రయినేజీ నుండి దుర్వాసన వెదజల్లుతున్న పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.అధికారులకు చెప్పినా ఫలితం లేదన్నారు.డ్రయినేజీలోని బురదను, పూడికను తీయాలన్నారు.ఇదిలా ఉంటే గ్రామంలో నీటి కోసం వేసిన పైపులైన్లు అనేక ఏండ్లు కావడంతో, మిషన్ భగీరథకు లింక్ చేసి నీటిని విడుదల చేసిన పైపులు ఎక్కడకక్కడ పగిలిపోతున్నాయన్నారు.అందుకే కొన్ని వార్డులలో నీరు వస్తున్న, మరికొన్ని వార్డులలో నీరు అందడం లేదని తెలుస్తుంది.