Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని పెద్డగూడెం పంచాయతీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తు ప్రజలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఎన్ ఆర్ జి ఎస్ నిధుల నుంచి 15 లక్షలు,తెలంగా ప్రబుత్వం నిధులు 20 లక్షలు,ఎం ఎల్ సి నిధుల నుంచి 05 లక్షలు మొత్తం 40 లక్షల నిధులతో పెద్డగూడెం గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా తెలంగాణ ప్రభుత్వ హయాంలో పనులు కొనసాగుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.40 లక్షల వ్యక్తంతో 1600 మీటర్లు సిసి రోడ్లు పనులు సర్పంచ్ కూన్రెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో కొనాగుతున్నాయి వార్డుల్లో సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమ్యాయి వీటి అనంతరం మరో 15 లక్షల వ్యయంతో మరిన్ని అభివృద్ధి పనులు చేయనున్నట్లు సర్పంచ్ తెలిపారు. దగ్గరవుండి పనులు పర్యవేక్షిస్తున్నారు మూడు సీసీ రోడ్ల నిర్మాణ చేపడుతున్నారు. గత ఐదు రోజులుగా పనులు జోరుగా కొనసాగుతన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగానే పలు సీసీరోడ్డు అభివృద్ధి పనులు జోరందుకున్నాయి.