Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈనెల 6న హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే సీఐటీయూ మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి కోరారు. ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్‌లో కలిసి వేతనాలు వెంటనే సవరించాలన్నారు. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు రంగాల జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 లను గెజిట్ చేయాలని కోరారు. కనీస వేతనం 26వేలు నిర్ణయించాలన్నారు. పేరుగుతున్న శాస్త్ర సాంకేతికత దృష్ట్యా రోజుకు 7 గంటలు, వారానికి ఐదు రోజులు పని దినాలు ఉండాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ధ సౌకర్యాలు పీఎఫ్, ఈఎస్ఐ సెలవులు బోనస్ గ్రాడ్యుటి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులకు 1979 అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం ప్రకారం హక్కులు, సౌకర్యాలు అమలు చేయాలన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మూడవత్ రవినాయక్, ఆయూబ్, సీఐటీయూ నాయకులు గుణగంటి రాంచంద్రు, బంటు రామారావు, శ్రీను, ప్రసాద్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.