Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ-నల్లగొండ
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు మూడు రెట్లు పెరిగాయని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుంభ కృష్ణారెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పట్టణంలోని బస్టాండ్ రోడ్లో 43 వ వార్డు శాఖ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో వంట గ్యాస్ ధర 400 రూపాయలు ఉండగా నేడు 1.174 పెరిగిందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిత్యవసర ధరలు పెంచుతుందని నిరసనలు తెలియజేస్తే దేశం కోసం ధర్మం కోసం ప్రజలు భరించాలని బీజేపీ చెప్తుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాకముందు 64 సంవత్సరాలు కాలంలో దేశం అప్పు 62 లక్షలు కోట్లుఅయితే ఒక బీజేపీి పాలనలో 2021, 2022 నాటికి 73 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసిందని, గత సంవత్సరం నాటికి ఈ దేశం అప్పు 135 లక్షల కోట్లుకు చేరుకుందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు మోయగానే ప్రజలపై భారాలను మోయడం దుర్మార్గమైన చర్య అని పెంచిన ధరలు తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ పై జీఎస్టీ నిషేధించాలన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ సభ్యులు కుంభం లక్ష్మమ్మ, కార్తీక్, నాయిని నర్సమ్మ, శ్యామల ప్రసన్న , శివమ్మ, జాన్‌రెడ్డి, ఎస్.విష్ణుమూర్తి, గోపాల్‌రెడ్డి, మునెమ్మ, పార్వతమ్మ, గనిపల్లి రాములు, బట్టు సత్తయ్య, బట్టు నిర్మల, బీబమ్మ తదితరులు పాల్గొన్నారు.