Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా విస్తృత సమావేశం ఆదివారం నల్లగొండ పట్టణంలోని మల్లు వెంకట్ నరసింహరెడ్డి విజ్ఞాన కేంద్రంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కరీమున్నీసా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు సుమారుగా ఐదు నెలల నుంచి పెండింగ్ బిల్లు ఉన్నాయని, ప్రభుత్వం బిల్లులు ఇవ్వడంలో తాత్సారం వహిస్తుందని, వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికార దినోత్సవం సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ముఖ్యమంత్రి ప్రకటించిన గౌరవ వేతనం ప్రకటించిన నాటి నుండే ఇవ్వాలని, ఈ పథకంలో పనిచేస్తున్న వారు అత్యధికులు దళితులు, బీసీలు, మైనార్టీలు వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం బియ్యం సరఫరాలో కూడా మధ్యాహ్న భోజన కార్మికులపై వ్యత్యాసం చూపిస్తుందని అన్నారు. మంచి బియ్యం రాక అన్నం మెత్తగా కావడం పలుకులు కావడం జరిగితే దానికి మధ్యాహ్న భోజన కార్మికులను బాధ్యులు చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఏప్రిల్ 5న చలో ఢిల్లీకి కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ మాట్లాడుతూ వంట షెడ్డులేని ప్రతి పాఠశాలలో వంట షెడ్డు నిర్మించి, పథకం ప్రారంభం అయినప్పుడు ఇచ్చిన వంట పాత్రలు కావడం వలన అవి పల్చ భారీ వండిన పదార్థాలు అడుగంటుతున్నవి కావున ప్రభుత్వం కొత్త వంట పాత్రలు ఇవ్వాలని, కార్మికులకు కాటన్ దుస్తులు ఇవ్వాలని, వంటగ్యాసు పూర్తిగా సబ్సిడీపై ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల కోసం మార్చి 10వ తేదీన ఎంఈఓ కార్యాలయం ముందు మార్చి 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు కార్మికులు పెద్ద ఎత్తున కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోలగాని యాదమ్మ, సహాయ కార్యదర్శి అల్లి అనురాధ, పానుగంటి లక్ష్మమ్మ, యూనియన్ ప్రచార కార్యదర్శి కోలేటి ముత్తమ్మ, జిల్లా నాయకులు గంగుల దమయంతి, దొడ్డి అండాలు, అనుముల అలివేలు, బుల్లెద్దు నీలమ్మ, మారేపాక లక్ష్మమ్మ, చామకూర రాములమ్మ, చిత్రం విజయ్, చిత్రం మల్లేష్, కొత్తలూరు స్వరాజ్యం, ఏకుల మహేశ్వరి, దండంపల్లి పార్వతమ్మ ,ఎల్లమ్మ, ప్రేమలత పద్మ ,బొప్పని గోవర్ధనమ్మ, లక్ష్మమ్మ, వేముల ఇందిరా, పందుల ముత్యాలు, బొజ్జ అలివేలు, చుక్క సైదమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, బాలమని, ప్రమీల సుమలత భారతమ్మ సత్తమ్మ, వెంకటమ్మ, లింగమ్మ, ధనమ్మ, రామేశ్వరి, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.