Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భువనగిరి మండలం కేసారం గ్రామంలో ఒక కోటి 35 రూపాయల అభివృద్ధి పనులకు భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఎస్ డి ఎఫ్ 25 లక్షలు నిధులు, హెచ్ఎండిఏ 34 లక్షలు, ఈజీఎస్ 24 లక్షలు రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్డు, వైకుంఠధామం, నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఎండోమెంట్ ద్వారా 50 లక్షల రూపాయలతో శివాలయం, రామాలయం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. శివాలయం రామాలయం గుడి నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన పులిపాటి శేఖర్ , దాతలు అందరిని సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జడ్పిటిసి సుబ్బూర్ బీరు మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, గ్రామ సర్పంచ్ పోతుల కృష్ణ యాదవ్,
మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు జనగాం పాండు, ఓం ప్రకాష్ గౌడ్, నాయకులు బలూగురి మధుసూదన్ రెడ్డి, జక్క రాఘవేందర్ రెడ్డి, అబ్బ గాని వెంకట్ గౌడ్, రేగు వెంకటేష్, అంకర్ల మురళీకృష్ణ, కాటిక జంగయ్య , కేశవపట్నం రమేష్, ఆతికం లక్ష్మీనారాయణ, రై స స మండల కన్వీనర్ కంచి మల్లయ్య, ఉప సర్పంచ్ కమ్మగాని భాస్కర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహ గౌడ్, జిల్లా నాయకులు గౌరారం నరేష్, వాబల్ దాస్ లక్ష్మణ్, బుషబోయిన పోశయ్య, పోతుల వెంకటేష్, వావల్ దాస్ సత్యనారాయణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.''ఘనంగా పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం.'' నవ తెలంగాణ : అడ్డగూడూరు: విద్యార్థీని విద్యార్థులు సమాజంలో మంచి ప్రవర్తనతో ఎదిగినప్పుడే గురువులు ఆనందిస్తారని గురువులు అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1990-91బ్యాచ్ పూర్వవిద్యార్దుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆనాటి గురువులను సన్మానించారు 32 సంవత్సరాల తర్వాత అందరూ కలుసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో గురువులు సంగెం నర్సింహారెడ్డి, సుందర్ దీక్షిత్, జి జగన్నాధచారి ,పి కనకయ్య, వి జనార్దనాచారి ,ఎస్ గురుమూర్తి ,వి రాంరెడ్డి, కె యాదగిరి, బి రాంరెడ్డి,స్వీపర్ ఎన్ బుచ్చమ్మ ,90-91 విద్యార్దిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.