Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం నుండి వెల్లంకి, సిరిపురం గ్రామాలకు వెళ్ళే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నందున ఆ రోడ్డు పనులు పూర్తి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం నుండి వెల్లంకి, సిరిపురం గ్రామాలకు వెళ్ళే రోడ్లు,హైవే రోడ్డు నుండి పిట్టంపెల్లి రోడ్డు,పిట్టంపెల్లి నుండి చిన్న కాపార్తి గ్రామానికి వెళ్లే రోడ్డును సీపీఐ(ఎం) బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు ఎక్కడికక్కడ గుంటలు పడి, కంకర తేలి ప్రయాణికులకు, రైతులకు అసౌకర్యంగా మారాయన్నారు. ప్రజల రవాణాకు ఇబ్బందికరంగా ఉన్న సిరిపురం, వెల్లంకి వెళ్ళే రోడ్ల పార్మేషను పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ రోడ్లు రెండు కిలోమీటర్ల దూరం కంకర వేసినా అది పూర్తిగా తేలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలమయంగా మారిన ఈ రోడ్డులకు తగిన నిధులు మంజూరు చేసి, మరమ్మత్తు పనులు చేపట్టకపోతే రాజ కీయాలకు అతీతంగా ప్రజలను సమీకరించి ఆందోళన, పోరాటాలు చేయవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రూరల్ మండల కార్యదర్శి అరూరి శీను, మండల నాయకులు నెలికంటి నర్సింహ, గ్రామశాఖ కార్యదర్శి పంది నరేష్, వివిధ ప్రజా సంఘాల నాయకులు అరూరి శంభయ్య, నరసింహ, ఏరుకొండ బసవయ్య, గడ్డం నర్సిరెడ్డి, గడ్డం రామకృష్ణారెడ్డి, అరూరి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.