Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి
నవతెలంగాణ-ఆలేరుటౌన్
నిరుపేద ప్రజల ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్, టెస్కాబ్ రాష్ట్ర వైస్చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని(చెక్కును) లబ్దిదారునికి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్య తరగతి కుటుంబల లో ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో గతంలో అప్పులు చేసి ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే వారన్నారు. కోలుకోలేని స్థితిలో ఉన్న కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరమన్నారు. కొంతైన ఆదుకోవాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గొర్ల కాపరుల సంఘం డైరెక్టర్ జల్లి నరసింహులు, కర్రె వెంకటయ్య , దయ్యాల సంపత్, గడ్డమీద శంకర్ గౌడ్,పాండవుల భాస్కర్ గౌడ్ , శిఖ శ్రీనివాస్ గౌడ్ , గుణగంటి బాబు రావు గౌడ్ , శ్రీకాంత్ గౌడ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.