Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన బస్సుల రాకపోకలు
- ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
- బస్టాండ్‌లో తాగునీటి కటకట
నవతెలంగాణ-ఆలేరుటౌన్
అసౌకర్యాలకు నిలయంగా ఆలేరు బస్టాండ్ తయారైంది.దానికి తోడు ఆలేరు పట్టణం నుండి గతంలో ఇతర ప్రాంతాలకు బస్ సర్వీసులు ప్రయాణికులకు అనుసంధానం గా ఉండేవి, నడిచేవి, ప్రయాణికులతో నిత్యం ఆలేర్ బస్టాండ్ కళకళలాడుతుండేది. ప్రస్తుతం పూర్తిగా పరిస్థితి మారింది. ఒకవైపు మండుతున్న ఎండలు, ఆలేరు బస్టాండ్ లో ప్రయాణికులకు తాగునీటి కటకట ఏర్పడింది. నిత్యం వచ్చి పోయే ప్రయాణికులకు వాటర్ బాటిల్ కొంటే గాని గొంతు తడవని పరిస్థితి నెలకొంది. పేరుకు పాత తాలూకా, ఆలేరు నియోజకవర్గ కేంద్రం హైదరాబాద్ ,వరంగల్ ప్రధాన నగరాల మధ్య ఆలేరు బస్ స్టేషన్ అన్ని అంగులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, విద్యుత్, పర్యాటక శాఖ మంత్రి 1984 సంవత్సరంలో మోత్కుపల్లి నరసింహులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఆలేరు పట్టణంలోనే బస్ డిపో ఏర్పాటు చేయాల్సి ఉండగ , రాజకీయ, ఇతర కారణాలతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో డిపో ఏర్పాటు చేశారు. ఎంతో చరిత్ర గల ఆలేర్ బస్టాండ్ వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి ప్రయాణికులు ఆలేరు వచ్చే టిఫిన్ చేసేవారు. హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్లేవారు ఆలేరు బస్టాండ్ లోనే టిఫిన్ చేసేవారు.
ఇతరాన్ని సౌకర్యాలు ప్రయాణికులు ఉండేవి. ఆలేరు పట్టణం నుండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తిరుగుతుండేవి, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేది, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అధిక శాతం బస్సులు నాన్ స్టాప్ పేరుతో బైపాస్ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నాయి. ఆ బస్సులు దాబాల వద్ద మాత్రమే ప్రస్తుతం ఆగుతున్నాయి. మారిన పరిస్థితుల కారణంగా ప్రయాణికులతో రద్దీగా ఉండి ఆలేరు బస్టాండ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.బస్టాండ్ లో ఎలాంటి సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు ప్రయాణికుల రద్దీతో ఉండే స్వాగతు హౌటల్ సైతం మూసి వేయబడింది. దుకాణ సముదాయాల నుండి ఆర్టీసీకి ఆదాయం సరిగా రాకపోవడంతో పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. పాలేరు పట్టణం నుండి మండలంలోని ఇతర గ్రామాలకు, మోత్కూర్ నైట్ హార్ట్ బస్సు యధావిధిగా నడిపించాలని గుండాల మోత్కూరు ఆలేరు మండలాలకు చెందిన ప్రయాణికులు కోరుతున్నారు. నిత్యం విద్యార్థులు ప్రయాణికులు రోజువారీగా ప్రయాణిస్తుంటారు. యాదగిరిగుట్ట నుండి ఆలేరు మీదుగా మోత్కూరు వెళ్లే నైట్ హార్ట్ బస్సు, ఆలేరు మండలంలోని మదనపల్లి , కొల్లూరు , షారాజీపేట,తూర్పు గూడెం, గొలనుకొండ , అమ్మనబోలు గ్రామాలను టచ్ చేస్తూ గుండాల మండలం అనంతారం, సుద్దాల, బ్రాహ్మణపల్లి, రామారం గుండాల మీదుగా మోత్కూర్ కు చేరుకునేది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం నుండి బచ్చన్నపేట, చేర్యాల మండలాల గ్రామాలను కలుపుకుంటూ కొమరవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రానికి నైట్ ఆల్ట్ బస్సు నడిచేది, బస్సును యధావిధిగా నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
నిత్యం కళాశాల , పాఠశాలలకు చెందిన విద్యార్థులకి సౌకర్యవంతంగా ఉండేది.ఆర్టిసి అధికారులు మొక్కుబడిగా వచ్చి పోతుంటారు. వెంటనే ఆలేరు ఆర్టీసీ బస్టాండ్‌లో త్రాగునీటి సౌకర్యంతో పాటు ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బస్టాండ్‌లో మంచినీటి సౌకర్యం కల్పించాలి
ఎలుగల కృష్ణ-స్థానికులు
ఆలేరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల సౌకర్యం మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేయాలి. వేసవి కాలం ప్రారంభం కావడంతో మంచినీళ్లు దొరకక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేసి నిరంతరం మంచినీటిని ప్రయాణికులకు అందించాలి.
బస్టాండ్ లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలి.
బస్టాండ్‌పై ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం తగదు
ఎండి బాబా- మైనార్టీ పట్టణ అధ్యక్షుడు
ఆలేరు బస్టాండ్ పై ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వైఖర్ని విడనాడాలి.అన్ని రకాల దుకాణాలకు అనుమతులు ఇవ్వాలి. అన్ని రకాల దుకాణాల
ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి.ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలి. వృద్ధులకి ,గర్భిణీలకి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
యాదగిరిగుట్ట డిపో మేనేజర్- బందరపు శ్రీనివాస్
ఆలేరు బస్టాండ్ లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. స్థానిక పురపాలక సంఘం వారిచే బస్టాండ్ ఆవరణలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు కొరకు పురపాలక కమిషనర్ మారుతీ ప్రసాద్ తో మాట్లాడడం జరిగింది. సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ ప్రజలు తమ దృష్టికి స్థానిక ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుతున్నా.