Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
బస్టాండ్ పోరాటానికి ప్రజల ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆఖిలపక్ష నాయకులు ఆరోపించారు.ఆదివారం మున్సిపల్ కార్యాలయం వద్ద అన్ని రాజకీయ పార్టీల ప్రజాసంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని బస్టాండ్ యధావిధిగా కొనసాగించాలని మేము చేస్తున్న పోరాటం ప్రజా ఆదరణ దినదినా పెరుగుదల చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని బస్టాండ్ ను యధావిధిగా కొనసాగించే వరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ రకమైన తప్పుడు ప్రకటన ద్వారా అఖిలపక్షంలో విభేదాలు తీసుకొచ్చి విడదీసి ఉద్యమం నీరు కార్చాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మా ఉద్యమాల పట్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని ఏ ఒక్కరు కూడా మా వెనుక ఉండి నడిపి యడం లేదని కావాలని దురుద్దేశంతో అసత్యపు ప్రకటనలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మా పార్టీలు వేరైనా, విధానాలు వేరైనా, జెండాలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా యాదగిరి గుట్ట ప్రజల ప్రయోజనాల కొరకు ఏ రాజకీయ లబ్ధి లేకుండా స్వచ్ఛందంగా వేలాది కుటుంబాల ఉపాధి కొరకు బస్టాండ్ కోసం పోరాటం చేస్తున్నామని అఖిలపక్ష నాయకులు ప్రకటించారపట్టణ ప్రజల పట్ల ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మేము చేస్తున్న డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ద్వంద వైఖరి విధానాలు అవలంబిస్తుంది అధికార పార్టీ అని ఒక వైపు బస్టాండ్ ఇక్కడి నుంచి పోదు అని చెప్తూనే మరోవైపు అక్కడ కట్టినప్పుడు ఎందుకు ఆపలేదని ప్రశ్నించడంలో అంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. నిజంగా బస్టాండ్ తరలింపు లేకుంటే ప్రభుత్వం నుంచి గాని, అధికార యంత్రంగా నుంచి గాని లిక్కిరింతపూర్వకమైనటువంటి హామీని ఇప్పియ్యాలని డిమాండ్ చేశారు. పట్టణ బస్టాండ్ యధావిధిగా కొనసాగించే వరకు, ఆటోలను కొండపైకి అనుమతించే వరకు, అవినీతి ఈఓ ను తొలగించి ఐఏఎస్ ఆఫీసర్ నియమించే వరకు, స్థానికులకే దేవాలయంలో ఉద్యోగాలు ఇచ్చేవరకు, భక్తుల కోసం హై స్కూల్ స్థలంలో వెయ్యి గదుల నిర్మాణం చేసే వరకు, పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జిని తొలగించే వరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. వీలుంటే సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని లేకుండా ఈ అబద్ధపు ప్రకటనలు చేస్తే బాగుండదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు బబ్బురి శ్రీధర్, కళ్లెం కృష్ణ, కాటబత్తిని ఆంజనేయులు, రచ్చ శ్రీనివాస్, బట్టు సతీష్ రాజ్, పేర బోయిన పెంటయ్య, బండి అనిల్, మిరియాల కృష్ణ, పేరబోయిన మహేందర్, బొజ్జ సాంబేష్ గుండు నరసింహ, ఈశ్వర్ రెడ్డి, మొగులయ్య, మనసుర్ పాషా, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.