Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-రామన్నపేట
తల్లిదండ్రులు ఎడ్ల సుదర్శన్‌రెడ్డి - జయమ్మ సహకారంతో ఎడ్ల వెంకటరెడ్డి - పార్వతమ్మ గార్ల జ్ఞాపకార్థం సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా నిర్వహించడంతోపాటు 70 లక్షల సొంత నిధులతో వెల్లంకి నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సకల వసతులతో అద్భుతంగా నిర్మించి గ్రామానికి అంకితం ఇవ్వడం శభాష్ మహేందర్ రెడ్డి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.మండలంలోని వెల్లంకి గ్రామంలో నిర్మించిన గ్రామపంచాయతీ నూతన భవనాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ ఎట్లా మహేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామంలోని అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ అందరిని కలుపుకొని పోతూ గ్రామాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. జిల్లాకే ఒక మోడల్ గా వెల్లంకి గ్రామపంచాయతీ భవనం ఉందన్నారు. మహేందర్ రెడ్డి నిర్ణయాలు అయినా గ్రామాన్ని తీసిన అభివృద్ధి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజల ఆశీర్వాదానికి మించినది ప్రజా నాయకుడికి ఏమీ లేదని ఆయన అన్నారు. మహేందర్ రెడ్డికి భార్యతో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా మెండుగా ఉందన్నారు. ప్రజా సేవ చేయడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించడం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైంది అన్నారు. గ్రామ అభివృద్ధికి నా వంతు సహకారంగా మరికొన్ని నిధులు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామస్తులు గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి సహకారంతో ప్రతి ఇంటి ముందు అందమైన మొక్కలు నాటాలని ఆయన సూచించారు. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలబడాలని ఆయన అన్నారు. ప్రముఖ కవి కూరెళ్ళ విఠలాచార్య తన కష్టార్జితాన్ని వెచ్చించి, ఒక అద్భుతమైన లైబ్రరీని గ్రామంలో ఏర్పాటు చేశారని, అందులో రెండు లక్షల పైచిలుకు అరుదైన, విలువైన గ్రంథాలను ఏర్పాటు చేయడం ఈ గ్రామం చేసుకున్న పుణ్యమని ఆయన అన్నారు. విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం జిల్లాకి ఆదర్శంగా ఉందన్నారు మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, మంత్రి జగదీశ్ రెడ్డి ప్రోత్సాహంతో అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. వెల్లంకి గ్రామ అభివృద్ధికి మరో 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన మంత్రిని కోరారు. ధర్మ రెడ్డిపల్లి కాల్వను పూర్తిచేసుకుని ప్రతి చెరువు, కుంటను నింపుతానన్నారు. చిట్యాల - భువనగిరి రోడ్డును మరమ్మతులను పూర్తి చేశామని, గుండ్రంపల్లి - వెల్లంకి రోడ్డుకు, సర్నేని గూడెం - వెల్లంకి రోడ్డుకు నిధులు మంజూరయ్యాయన్నారు.ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతానన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామన్నారు. ఎడ్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వెల్లంకి గ్రామాన్ని పట్టణంలో తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. గ్రామంలో ఐదు వేల మీటర్ల సీసీ రోడ్లు నిర్మించామని, మంత్రి జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో రానున్న సంవత్సరం కాలంలో మరింత అభివృద్ధి చేస్తామనీ, మౌలిక వసతుల కల్పన కోసం రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. గ్రామంలో అన్ని వర్గాలు, పార్టీలు, ప్రజలు పూర్తి సహకారం అందిస్తున్నారని వారందరికీ శతకోటి వందనాలు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్ రెడ్డి, ఎర్రోళ్ల లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ రవ్వ అనసూయ, జడ్పిటిసి పున్న లక్ష్మి, ఎంపీపీ కన్నబోయిన జ్యోతి, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, పీఏసీఎస్ చైర్మెన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, మాజీ సర్పంచులు తాళ్లపల్లి సత్తిరెడ్డి, కూరెళ్ళ నరసింహ చారి, వివిధ గ్రామాల సర్పంచులు అప్పం లక్ష్మీనర్సు, గుత్తా నరసింహారెడ్డి, ధర్నే రాణి, మెట్టు మహేందర్ రెడ్డి, రేఖ యాదయ్య, ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, గూగు పద్మ, సిపిఐ (ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేకఅశోక్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మందడి ఉదరు రెడ్డి, నాయకులు పున్న జగన్మోహన్, అంతటి రమేష్, నీల్ల దయాకర్, అవనిగంటి నగేష్, బర్ల బాబురావు, ఎడ్ల సురేందర్ రెడ్డి, బొక్క పురుషోత్తం రెడ్డి, కాటేపల్లి యాదయ్య, గ్రామీణ మహిళలు తదితరులు పాల్గొన్నారు.