Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ-ఆలేరుటౌన్
రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వసతిగృహాలలో విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, మెనూ ప్రకారం మెరుగైన పౌష్టికాహారం అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాట్ల గురించి స్థానిక మహిళలతో ఆదివారం చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థినులకు వసతిగృహాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు.మైనారిటీ గురుకుల పాఠశాల,కళాశాలతో పాటుగా షెడ్యూల్ కులాల బాలికల మైనారిటీ పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు,విద్యాబోధనను టీచర్ల సమక్షంలో అయితే చెప్పకపోవచ్చని ప్రత్యేకంగా విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.వసతి గహంలోని ప్రతి ఒక్క విద్యార్థిని పిలిచి అటెండెన్స్ తీసుకుంటూ భోజన వసతి,ఇతర సౌకర్యాల పట్ల విద్యార్దినిలనే అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం,మంచినీటి వసతి, మరుగుదొడ్ల పరిశుభ్రత గురించి సిబ్బందితో చర్చించామన్నారు.ఈవినింగ్ స్నాక్స్ నాలుగు గంటలకు పెట్టవలసిన ఫలహారం ఆలస్యంగా పెట్టడంతో సిబ్బందిని మందలించడం జరిగిందన్నారు.వంటశాలను పరిశీలించి విద్యార్థులకు సమయానికి మెను ప్రకారం,స్నాక్స్,భోజనం పెట్టాలని ఆదేశించారు.ఎస్సీ వసతిగృహంలో 40 మంది విద్యార్థులకు గాను 22 మంది మాత్రమే హాజరుగా ఉండడంపై మిగతా విద్యార్దుల వివరాలను సేకరించి రిజిస్టర్లలో నమోదుచేశారు.సుమారు రెండుగంటల పాటు ప్రతి విద్యార్థితో మాట్లాడి వారి కుటుంబసభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్చైర్మెన్ వస్పరి శంకరయ్య,తహసీల్దారు రామకృష్ణ, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు సీసా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.