Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారామలు
నవతెలంగాణ- భువనగిరి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, యువజన, విద్యార్థి, కార్మిక, మహిళా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల మధ్య ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఈనెల 17 నుండి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు జన చైతన్య యాత్రలు చేస్తున్నామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్ల కాలంలో ప్రజల మీది నిత్యావసర సరుకుల ధరలు, ముడి చమురుల ధరలు ఇలా అనేక రకాల పద్దతిలో భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరుస్తూ నిరంకుశ పాలన చేస్తున్నారు అని వారు అన్నారు. ప్రజల మధ్య కులాల పేరుతో మతాల పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ సెక్యులర్ భారతదేశం మీద మతోన్మాద భావాజాలాన్ని వ్యాప్తి చేయాలనే కుట్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కలిగిన తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మతోన్మాద ఆగడాలు సాగనివ్వమని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఒకవైపు ధరల భారం మరొకవైపు మతోన్మాద బావజాలం ప్రభావం చూపుతుందన్నారు.బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు యువజన విద్యార్థి మహిళ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఈనెల 17 నుండి 29 వరకు సాగే జనచైతన్య యాత్రలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో మతోన్మాద బీజేపీ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. జన చైతన్య యాత్ర ద్వారా జిల్లాలో ఉన్న ప్రజలను సమీకరించి బిజెపి మతోన్మాద విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం యాత్ర జయప్రదం చేయడం కోసం ప్రజలను సమీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మేక అశోక్ రెడ్డి, మండల కార్యదర్శులు సిర్పంగి స్వామి, దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ, బొల్లు యాదగిరి, జెల్లెల పెంటయ్య, పగిళ్ళ లింగారెడ్డి, బబ్బూరి పోశెట్టి, బొడ్డుపల్లి వెంకటేష్, గుంటోజు శ్రీనివాసచారి, వెంకటనర్సు, గంగాదేవి సైదులు, దోడ యాదిరెడ్డి, గడ్డం వెంకటేష్, వనం ఉపేందర్ పాల్గొన్నారు.