Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
మహిళలు ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రసూతి వైద్య నిపుణుల సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్ రాపోలు మంజుల రఘునందన్, ఐఎంఏ నకిరేకల్ యూనిట్ అధ్యక్షుడు రాపోలు రఘునందన్ పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్‌లో నల్లగొండ ఓబిజీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. మహిళలపై జరుగుతున్న హింస, లైంగిక వేధింపులను దీటుగా ఎదుర్కోవాలన్నారు. మహిళల పట్ల జరుగుతున్న వివక్షతను రూపుమాపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ఉమా కృష్ణమూర్తి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.