Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛభారత్ మిషన్ - గ్రామీణ పేజ్ 2 శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్రెడ్డీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ట్విన్ పిట్ల నిర్మాణం మొదలైన అంశాలపై గ్రామాల్లో సర్వే నిర్వహించి బడ్జెట్ తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల నిర్వహణ, మహిళా సంఘాల పనితీరు పై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి పనులను వేగవంతం చేయాలని, లేబర్ బడ్జెట్ కనీసం గ్రామానికి వంద మంది కూలీలు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నర్సరీలు, పల్లె ప్రకతి వనాలు, పారిశుధ్యం నిర్వహణ, కంపోస్ట్ షెడ్లలో సేంద్రియ ఎరువుల తయారీ విషయంలో మరింత శ్రద్ధ చూపాలని తెలిపారు. మహిళా సంఘాలకు సంబంధించి బ్యాంకు లింకేజీ టార్గెట్ 37.51 కోట్ల గాను 34.51 కోట్ల రుణాలను పంపిణీ చేయడం జరిగిందని అధికారులు వివరించారు. స్త్రీనిధి రుణాలు పంపిణీ లక్ష్యం 5 కోట్ల 68 లక్షల గాను, 4 కోట్ల 78 లక్షల రూపాయలను అర్హులకు పంపిణీ చేసినట్లు తెలియజేశారు.స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణ లో గ్రామాలను ఒడీఎఫ్ ప్లస్ ప్రమాణాలను నిర్వహించుటకు గాను పంచాయితీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్ లకు, టెక్నికల్ అసిస్టెంట్లులకు జిల్లా గ్రామీణ అభివృద్ధి కో ఆర్డినేటర్ల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీిఓ లాజర్, ఎంపీఓ పద్మ, ఎస్బిఎం కోఆర్డినేటర్ శంకర్‌బాబు, మొయినుద్దీన్, ప్రభాకర్‌రెడ్డి, ఏపీఓ శ్రీలత, ఐకేపీ ఏపీఎం పద్మ, మండలం లోని అన్ని గ్రామాల పంచాయితీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సెర్పు సిబ్బంది పాల్గొన్నారు.