Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ ఎస్పీ. కేఆర్కే. ప్రసాదరావు
నవతెలంగాణ-నార్కట్పల్లి
రోడ్డుప్రమాదాలు జరిగినప్పుడు ఆపదలో ఉన్నవారికి ప్రథమ చికిత్స ఆపన్న హస్తం అని అడిషనల్ ఎస్పీ కేఆర్కే.ప్రసాదరావు పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రమాదంలో ప్రథమ చికిత్స అనే అంశాలపై అదనపు డీజీ బీ. శివధర్ రెడ్డి సూచన మేరకు ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో 'ఆక్సిడెంట్ ఫస్ట్ రెస్పాండిర్టైనింగ్ కోర్సు' పేరిట నార్కట్పల్లి పోలీసుశాఖ తలపెట్టిన కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ ప్రసాదరావు సోమవారం స్థానిక హోటల్ వివేరలో ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి చేయాల్సిన ప్రథమచికిత్స, అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్ సేవలను అందించే విధానాన్ని డాక్టర్ మధుసూదన్ మాక్ డ్రిల్ చేసి వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు వెన్నపూస మెడ శరీర భాగాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఫిట్స్ వచ్చినప్పుడు కరెంటు షాక్ తగిలినప్పుడు, ఎండ దెబ్బ తగిలినప్పుడు, తక్షణం అందించాల్సిన ప్రధమ చికిత్స పై వివరించారు. అడిషనల్ ఎస్పీ ప్రసాదరావు మాట్లాడుతూ.. 2000- 2021-22 సంవత్సరంలో అత్యధికంగా నార్కట్పల్లి చిట్యాలలో గుండెపోటుతో మరణించినట్లుగా గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 60 పోలీస్ స్టేషన్లో పరిధిలో ప్రమాదము ప్రథమ చికిత్సపై ఆర్ఎంపీ డాక్టర్లకు ఆటో డ్రైవర్లకు దాబా హౌటల్ యజమానులకు సెక్యూరిటీ గార్డులకు పోలీస్ సిబ్బందికి ప్రమాదంలో ప్రథమ చికిత్స అందించే విధానాన్ని ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతవిభాగం డీఎస్పీ చంద్రబాను, నార్కట్పల్లి సీఐ కే. శివరాంరెడ్డి, నార్కట్ పల్లి ఎస్సై బి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.