Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ భాస్కర్రావు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణీ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 82 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని తగు ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్ రూమ్, భూ సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను మాత్రమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి మోతిలాల్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.