Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా
- విచారించి న్యాయం చేస్తాం: మున్సిపల్ చైర్మెన్
నవతెలంగాణ-మిర్యాలగూడ
అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ఆయా వార్డులకు చెందిన పేదలు సోమవారం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, సొంత ఇండ్లు, భూములు ఉన్నవారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ సరిగా చేయలేదని, దాని వలన అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందకుండా పోయాయని విమర్శించారు. 27వ వార్డులో ఐదుగురికి సొంత ఇండ్లు ఉన్నప్పటికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని, వాటిపై విచారణ జరిపించాలని ఆ కాలనీ ప్రజలు తహసీల్దార్ అనిల్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న మహిళలను మున్సిపల్ చైర్మెన్ భార్గవ్ శాంతి పరిచారు. అన్ని వార్డుల్లో లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగలేదని, విచారణ సరిగా చేయకపోవడంతో అర్హులకు అన్యాయం జరిగిందని తెలిపారు. అని వార్డుల్లో రీ సర్వే చేయాలని ఆర్డీవో తాసిల్దారులకు వివరించామని తెలిపారు. అర్హులకు ఇండ్లు వచ్చే విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపికైన లబ్ధిదారులను సమగ్రంగా విచారించి అర్హులకు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.