Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాపూజీ నగర్లో ఖాళీ సిలిండర్లతో నిరసన
నవతెలంగాణ-మిర్యాలగూడ
పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. పట్టణంలోని బాబూజీ నగర్ కాలనీ వాసులు ఖాళీ సిలిండర్లు రోడ్డుపై ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేకమార్లు గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. 400 రూపాయలు ఉన్న వంట గ్యాస్ 1200 రూపాయలకు చేరుకుందని, రోజు కూలికి వెళ్తేనే కుటుంబం గడిచేదని అలాంటి పరిస్థితుల్లో గ్యాస్ కొనలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. కట్టెల పొయ్యి దిక్కేనంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుజాత, ముతమ్మ, కవిత, వరమ్మ, అమీనా, కలమ్మ, భారతి, విజయ, గౌసియ, భవానీ, ఎస్.వెంకటేశ్వర్లు, ఆర్. శివరాజు, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో...
పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని యాదగిరిపల్లి గ్రామంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ మాట్లాడుతూ సామాన్యుని నడ్డి విరుస్తూ కార్పొరేట్ శక్తులకి అనుకులంగా కేంద్ర ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహారించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానం చూస్తుంటే మహిళలను మళ్ళీ కట్టెల పొయ్యి పై వంట చేసి కన్నీరు తెచ్చేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల మట్టయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ధీరావత్ మోహన్ నాయక్, పోతుగంటి కాశి, రామాంజి జిల్లా నాయకులు వీరయ్య, శ్రీను నాయక్, శేఖర్, సైదులు, స్నేహ, సైదమ్మ, ఇద్దయ్య, ఇమ్మానియెల్, సందీప్, పరమేష్ పాల్గొన్నారు.