Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలంలోని బండమీది చందుపట్ల గ్రామంలో వేంచేసియున్న శ్రీ అలివేలు మంగసమేత వెంకటేశ్వర స్వామి అధ్యయనోత్సవ బ్రహ్మోత్సవ కల్యాణోత్సవం కార్యక్ర మాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మెన్ మారినేని సుధీర్‌రావు మాట్లాడుతూ వందల ఏండ్ల చరిత్ర కలిగిన స్వయంభు వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందారన్నారు.ప్రభుత్వం నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయ నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయించారని చెప్పారు.దీంతో పాటు దాతల సహకారంతో మరో రూ.50 లక్షలు సేకరించి ఈ దేవాలయాన్ని మహా క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేడు జరిగే గరుడ ముద్దా స్వామివారి కల్యాణోత్సవానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి,ఇతర ప్రముఖులు హాజరవుతున్నట్లు దేవాలయ కమిటీ చైర్మెన్ ముద్దా వెంకన్న యాదవ్, ఆలయ ఈవో కుశలయ్య వెల్లడించారు. స్వామివారి కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. శివాలయంలో కోలా సుబ్బయ్య శాస్త్రి ,శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పురోహితులు ముడుంబా లక్ష్మీనరసింహ చార్యులు, నాగరాజు ఆచార్యులు, శ్రవణ్ కుమార్‌చారి, సర్పంచ్ బోయిల కృష్ణ, ఉపసర్పంచ్ కృష్ణ, దేవాలయ కమిటీ సభ్యులు కలగాని వెంకన్న,శిగ వీరస్వామి, శిగ శ్రీను, కోడి శోభన్ బాబు, కృష్ణ,గుద్దేటి చిన్న వెంకన్న, సీతారామారావు, పూర్ణచందర్రావు, లింగాల సతీష్, శివరాత్రి రమేష్, శ్రీశైలం, అనంతుల ఆంజనేయులు, మల్సూర్, దేవాలయ కమిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.