Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే కాంగ్రెస్ పార్టీకి సంబం ధించిన బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు చెరుకు సుధాకర్ కొడుకుకి ఫోన్ చేసి, ఫోన్లో ఇష్టం వచ్చినట్లుగా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు కోరారు.సోమవారం మండలకేంద్రంలో తిరుమలగిరి బీసీ ముఖ్యనాయకులు, వివిధ సామాజిక ఉద్యమ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో చెరుకు సుధాకర్ యొక్క పాత్ర ముఖ్యమైనదని, ఎప్పుడూ ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పరితపించే బడుగు బలహీన వర్గాలకు చెందినటు నాయకులు అన్నారు.ఆయన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారన్నారు.అటువంటి వ్యక్తి ఎంపీ వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య, ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమయ్య, జంబుద్వీప జనసమితి రాష్ట్ర కన్వీనర్ పత్తెపురం యాదగిరి, ఎస్సీ నాయకులు కృష్ణనాయక్, శ్రీనునాయక్, బీసీ నాయకులు గాదరబోయిన లింగయ్య, అంబటి మహేష్‌గౌడ్, పోరేళ్ల విప్లవ్,చిత్తలూరి కృష్ణమూర్తి, తరుణ్, తదితరులు పాల్గొన్నారు.