Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
మండలంలోని ఐదు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పబ్లిక్ పరీక్షలపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు వెంకన్న అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ఎన్.రవి హాజరై మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలు రాయబోయే విధానాన్ని గూర్చి వారికున్న సందేహాలను నివృత్తి చేయడం కోసం, భయాన్ని, ఆందోళన, తొలగించడం కోసం మండలంలో ఏడుగురు ఉపాధ్యాయుల చేత అన్ని సబ్జెక్టుల మీద విద్యార్థులందరికీ ప్రశ్నాపత్రాల సరళిని గురించి తదితర విషయాలను టీచర్ల ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఆసియా జబీన్, ఉపాధ్యాయులు కృష్ణయ్య, జాన్ షరీఫ్, ప్రభాకర్, గుండా వెంకటేశ్వర్లు, జమాల్ షరీఫ్, ఉపేందర్, కృష్ణప్రియ, తదితరులు పాల్గొన్నారు.