Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని యర్రవరం గ్రామంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలందరూ సమిష్టిగా కలిసి బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. ఎర్రవరం గ్రామంలో వెలసిన బాల ఉగ్ర నరసింహ స్వామి ఈనెల 10వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం ఉండటం వలన గ్రామానికి ముఖ్య నాయకులు వస్తారని తెలిపారు. అందరూ కలిసికట్టుగా సమన్వయంతో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు భాషబోయిన భాస్కర్ మాట్లాడుతూ గ్రామంలో జరిగే కార్యక్రమానికి అందరం కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించాలని, 20 మంది యువకులను వాలంటీర్లుగా ఏర్పాటుచేసి అన్నదాన కార్యక్రమాలు వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడడానికి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రావుల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షరలు బెల్లంకొండ వెంకటేశ్వర్లు,దేవాలయ కమిటీ ఛైర్మెన్ నలజాల జగన్నాథం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.