Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
- ఆరోగ్య మహిళ కేంద్రాలు ప్రారంభం
- కలెక్టర్ ఎస్.వెంకట్రావ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుండి ప్రజావాణిలో చేసుకున్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ యస్.వెంకట్రావు జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, యస్.మోహన్రావులతో కలిసి మాట్లాడారు.జిల్లాలో మహిళా దినోత్సవం ఘనంగా జరపాలని దేనికోసం మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించి మహిళా దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేయాలన్నారు.జిల్లాలో 8 ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో మహిళలకు పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు తో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. నాలుగు నియోజకవర్గాలలో జరుగు కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యానంగా గ్రామీణ ప్రాంతాలలో పశువుల కొరకు నీటి తొట్లలో నీటిని ఈ వేసవి కాలంలో నీటిని నింపాలని అలాగే నాటిన మొక్కలను సంరక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 35, గ్రామీణాభివద్ధి శాఖ 9, ఇతర శాఖలకు సంబంధించి 10 మొత్తం 54 దరఖాస్తులు అందాయని అట్టి వాటిని తగు చర్యలు అధికారులకు పంపించామన్నారు.
జిల్లాలో పది, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లాలో మార్చి,ఏప్రిల్ మాసాలలో నిర్వహించే పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని విద్యా అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు ఆదేశించారు. జిల్లాలో పది , ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, యస్. మోహన్రావులతో కలిసి మాట్లాడారు.ఏప్రిల్ 3 నుండి 13 వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 13.45 వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.అలాగే 69 కేంద్రాలలో 12386 మంది విద్యార్థులు హాజరవుతున్నందున ముందుగా అన్ని మౌలికవసతులు కల్పించాలని కోరారు.ముఖ్యంగా తాగునీరు, నిరంతర విద్యుత్, ఏఎన్ఎంతో పాటు మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 15 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9 నుండి మద్యాహ్నం 12 వరకు 33 కేంద్రాలలో 16390 మంది పిల్లలు పరీక్షలకు హాజరవుతున్నారని మొదటి సంవత్సరం 6727 అలాగే రెండోవ సంవత్సరం 7089 మంది , వొకేషనల్ మొదటి సంవత్సరం 1515, రెండవ సంవత్సరం 1399 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొనుచున్నందున వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని అలాగే ప్రభుత్వ నిబంధనలకు లోబడి అన్ని కేంద్రాలో నియమించిన సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీఈఓ అశోక్, డీపీఓ యాదయ్య, డీఐఈఓ కృష్ణయ్య, పోలీస్, మెడికల్, పోస్టల్, విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.