Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పేద మధ్యతరగతి ప్రజలపై బారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక ఎంవీఎన్ భవన్లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్ అధ్యక్షతన జరిగిన పార్టీ నియోజకవర్గ, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందన్నారు.అచ్చే దిన్ పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. బీజేపీ ి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేట్ పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తూ పేద మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందన్నారు.హిందూత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి దేశంలో ముస్లిం, మైనార్టీలకు రక్షణ లేకుండా చేస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుందని పేర్కొన్నారు.దేశం వెలిగిపోతుందని గొప్పలు చెబుతున్న మోడీ దేశ రాజ్యాంగాన్ని రక్షించడంలో విఫలమయ్యారన్నారు.పెట్టుబడి దారులకు, కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తుందన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక, ప్రజాస్వామ్య విలువలను మంట గలుపుతూ, రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం కోసం లౌకిక,ప్రజాస్వామ్య, అభ్యుదయ, సామాజిక శక్తులు ఐక్యంగా ఉద్యమా లకు సిద్ధం కావాలని కోరారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరి రావు,కోట గోపి,జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురి గోవింద్,మేకనబోయిన సైదమ్మ,కొప్పుల రజిత, చినపంగి నర్సయ్య, వీరబోయిన రవి పెన్ పహాడ్, ఆత్మకూరు ఎస్ సీపీఎం మండల కార్యదర్శులు రణపంగ కృష్ణ,అవిరే అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.