Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
నేరేడుచర్ల మండల పరిధిలోని పెంచికల్ దిన్న నుండి ఫత్తేపురం వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉన్న రోడ్డును దాతల సహాయంతో పూడ్చివేసిన పెంచికల్ దిన్న గ్రామ అఖిలపక్ష నాయకులు. ప్రయాణికులకు రైతులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవున్నది.ఆ రోడ్డు ప్రమాదకరంగా ఉందని గతంలో ఆరోడ్డులో ధాన్యంతో ప్రయాణించే ట్రాక్టర్ బోల్తా పడి రైతుల ఇబ్బందులకు గురయ్యారు.అది గమనించిన సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకులు, రైతులు ఆర్ధిక సహకారంతో 60 ట్రిప్పుల మట్టి పోసి ఆ రోడ్డు గుంతలను పూడ్చివేయించారు.ఈ కార్యక్ర మంలో పెంచికల్దిన్న సర్పంచ్ సుంకరివాణి శ్రీరామ్మూర్తి, సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకులు నందమూరి బాబురావు,అల్వాల శ్రీధర్, జీడిమెట్లరవి, ఉపసర్పంచ్ ఎల్లబోయిన వెంకటి, పారుపల్లి శ్రీను వూట్కూరి సైదులు ,పెండెం హరిబాబు పోగుల సైదులు పెరుగు నాగరాజు, మరియు రైతులు రాచూరిసురేష్, ఎల్లబోయిన నాగరాజు, వలపని సత్యం, పెండెం రాంబాబు,పెండెం సైదులు రమాచనేని మురళి పాల్గొన్నారు.