Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిద్ర మత్తులో అదికార యంత్రాంగం
- రెండేండ్లుగా నిరీక్షణ
- 21ఎకరాల భూమికి 18ఎకరాలకే పర్మిషన్
- గ్రామస్తులపై పోలీసుల జులూం
నవతెలంగాణ-ఆలేరురూరల్
ఆలేరు మండలం శర్భనాపురం గ్రామంలో సర్వే నెంబర్ 525,526లో స్ఫూర్తి గ్రీన్ నేస్టు ప్రయివేట్ వెంచర్లో గ్రామకంఠానికి చెందిన 30 గుంటల భూమిని ఆక్రమించి గోడ నిర్మాణం చేసుకున్నారు.ఈ విషయాన్ని గ్రామస్తులు సంబంధించిన అధికారులకు పలుమార్లు దరఖాస్తు చేసుకున్న పటించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అడిగినందుకు బెదిరింపులు..
గ్రామానికి అనుకొని గతంలో పాత ఊరు ఉన్న 30 గుంటల భూమిని ప్రయివేట్ వెంచర్ నిర్వాహకుడు ఆక్రమించాడు.పది రోజుల కింద గ్రామస్తులు వెంచర్ నిర్వాహకున్ని సంబంధిత విషయంపై అడగగా రెండ్రోజుల్లో వచ్చి గ్రామస్తులతో చర్చించి మాట్లాడతానని హామీ ఇచ్చాడు.పది రోజులు గడిచిపోయినా వెంచర్‌కు రావడానికి మొహం చాటేశాడు.ఈ విషయంపై గ్రామస్తులు ఏకదాటిగా ఒక్కటై వెంచర్ గేట్‌కు తాళవేద్దామని చర్చించుకున్నారు.గేట్ దగ్గరకు వెళ్లి రోడ్డు మీద నిలబడి మాట్లాడుతుండగా వెంచర్‌కు సంబంధించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు పెట్రోలింగ్ వాహనం పై వచ్చి గ్రామస్తులను భయబ్రాంతులకు బయబ్రాంతులకు గురి చేశారు. వెంచర్‌పై ఎందుకు దాడి చేస్తున్నారని పోలీసులు బెదిరించారు.ఈ విషయంపై పోలీసులను గ్రామస్తులు వివరణ అడగగా గ్రామకంట్ల భూమి లేదని వెంచర్ నిర్వాహకుడు చెప్తున్నాడని సమాధానం ఇచ్చాడు.గ్రామస్తులు సర్వే నెంబర్ 525,526 నెంబర్ గల భూమిలో 20ఎకరాల 18గుంత ల భూమి ఉన్నది. అందులో 30 గుంటల భూమిని ఉన్నదని గ్రామస్తులు అధికారులకు 2021 సంవత్సరం నుంచి చెబుతూ వస్తున్నారు. వెంచర్ మొదలు పెట్టిన నుంచి ఇప్పటి వరకు సమాచారం కోసం గ్రామస్తులు మండల, జిల్లా ఉన్నతధికారులకు దరఖాస్తులు ఇచ్చి సమాచారం అడగగా అడిగినప్పుడల్లా రేపు మాపు అంటూ సమయాన్ని గడుపుతున్నారు.గ్రామ సభలో ఈ భూమి పై పలువురు గ్రామస్తులు చర్చించారు.
రెండేండ్లు దాటినా సమాచారమివ్వని అధికారులు
గ్రామానికి సంబందించిన కొందరు గ్రీన్ నేస్ట్ వెంచర్ పై సమాచారం అడగగా 20.26 ఎకరాలకు గాను 18ఎకరాలకు లే అవుట్ చేశారని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నారు.రెండేండ్లు అయినప్పటికీ పట్టించుకోవడం లేదు.ఎంతో సహనంతో గ్రీన్ నేస్టు వెంచర్ నిర్వాహకునికి గ్రామస్తులు సమాచారం కోసం అడగగా గ్రామస్తులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. సర్వేయర్‌ను పిలిచి కొలిపిస్తానని మండల అధికారులు హామీ ఇచ్చారు కానీ సర్వే చేయకుండా సర్వే చేశామంటూ గ్రామస్తులను మోసగిస్తూ అధికార యంత్రాంగం కూడా వెంచర్ నిర్వాహకులకు కొమ్ముగాస్తూ గ్రామస్తులను మోసం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా సుమారు 100మంది గ్రామకంఠం భూమిని ఆక్రమించడానికి మీరేవరని ప్రశ్నించారు.డబ్బు బలంతో పోలీసు యంత్రాంగం దింపి గ్రామస్తులపై జులూం చేశారు. వెంచర్ నిర్వాహకులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని గ్రామకంఠం భూమిని తమకు దక్కేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
14వ తేదీలోపు రికార్డులు అందిస్తా
ఎంపీఓ-సలీం
శర్బనాపురం గ్రామంలో ఓ ప్రైవేటు వెంచర్లో 525, 526 సర్వే నెంబర్లలో 30 గుంటల భూమి గ్రామకంఠం ఉందని గ్రామస్తులు ఆరోపించారు.సర్వే చేయించాను ఈనెల 14వ తేదీ వరకు రికార్డ్స్ అందజేస్తాను
తూతూమంత్రంగా భూమి సర్వే
అంగడి భిక్షపతి-గ్రామస్తుడు
అధికారులకు గ్రామంలో 525, 526 సర్వే నెంబర్లు 30 గుంటల గ్రామకంఠం భూమిఉందని చెప్పినప్పటికీ అధికారులు భూమి సర్వే చేస్తామని చెప్పి గ్రామస్తులు లేని సమయంలో భూమి సర్వే చేశారు. సర్వే నెంబర్లు వేయకుండా ఎలా చేస్తారని, అధికారులు వెంచర్ నిర్వాహకులు చెప్పినట్టు వింటున్నారు.
గ్రామానికి గ్రామకంఠం భూమి ఇవ్వాలి
రామ్చర్ల నర్సింగరావు- గ్రామస్తుడు
గ్రామంలో ఓ ప్రైవేటు వెంచర్ ప్రారంభించారు.అందులో గ్రామకంఠం భూమి 30 గుంటలు ఉంది. వెంచర్ నిర్వాహకులు 20 ఎకరాల 26 గుంటల భూమి సర్వే చేసి గ్రామకంఠం 30 గుంటలు ఉంటుంది.దానిని గ్రామపంచాయతీకి ఇవ్వాలి