Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని సీపీఐ (ఎం) గుండాల మండల కార్యదర్శి మద్దెపురం రాజు డిమాండ్ చేశారు.సోమవారం తహశీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.తహసీల్దార్ జ్యోతికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ కు 50 రూపాయలు,మరియు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ కు 350 రూపాయలు పెంచింది.ఇంత పెద్ద మొత్తంలో పెరిగిన సిలిండర్ ధరల వల్ల సామాన్యులపై మోయలేని భారం పడుతుందన్నారు.ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటు తున్నాయన్నారు.దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల సామాన్యులపై భారం పడుతుందన్నారు.పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను ఉపసంహరించుకోవాలని ప్రజలపై భారాలు పడకుండా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు పోతరబోయిన సత్యనారాయణ,ఎండి ఖలీల్,మల్లబోయిన బాలయ్య,బత్తిని బిక్షం,పెద్దపడిశాల మాజీ ఉపసర్పంచ్ పోతరబోయిన అంజయ్య,శాఖపురం లింగయ్య,కొలిచెలిమ అబ్బయ్య,గూడెపు వెంకటయ్య,ఆకుల నర్సయ్య,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.