Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాల హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 12వ తరగతి చదువుతున్న దుబాషి మనోహర్ ఆదివారం రోజున హాస్టల్ మిత్రులతో కలిసి హుస్నాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న బావిలోకి ఆటవిడుపుకు ఈతకు వెళ్లడం జరిగింది.ప్రమాదవశాత్తు మనోహర్ కాలుజారి బావిలో పడి మృతి చెందడం జరిగింది. ఈ మృతిపట్ల భువనగిరి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మనోహర్ కుటుంబాన్ని ఆదుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిచిన హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చెయ్యాలని ప్రభుత్వ హాస్పిటల్ ముందు వివిధ పార్టీలు, ప్రజాసంఘలు ధర్నా నిర్వహించారు. విద్యార్థి మృతి పట్ల జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి జైపాల్‌రెడ్డి నేతృత్వంలో మరణించిన విద్యార్థి తక్షణ సహాయం కింద రూ.50,000 మనోహర్ కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ప్రభుత్వపరంగా వచ్చే ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు బర్రె జహంగీర్,మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బర్రె జహంగీర్, దళిత బహుజన సీనియర్ నాయకులు బట్టు రామచంద్రయ్య, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సుర్పంగ శివలింగం,బీఎస్పీ జిల్లా ఇన్చార్జి బండార్ రవివర్ధన్ ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్ ,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు ,కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అన్నంపట్ల కృష్ణ, సందెల రాజేష్ ,ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి చింతల శివ, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎండి అత్తర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బిసుకుంట్ల సత్యనారాయణ, నాయకులు మహేష్, వెంకటేష్ ,గోనూరు ,సాయి, నివాస్ నేహాల్, బాసాని మహేందర్ పాల్గొన్నారు.