Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.సోమవారం వాసవి గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.మండలంలోని బండకొత్తపెల్లి,పెద్ద పడిశాల,అనంతారం,వంగాల, మాసాన్ పల్లి,వెల్మజాల, సీతారాంపురం గ్రామాల నుండి బండకొత్తపెల్లి ఉపసర్పంచ్ పారుపల్లి లక్ష్మయ్య,మాజీ ఎంపీపీ నత్తి లచ్చయ్య,బొబ్బల సోమిరెడ్డి సీనియర్ నాయకులు బండ గిరిధర్‌రెడ్డి,సురేష్‌రెడ్డి భూపాల్‌రెడ్డి, రస్తాపురం చంద్రు,మంద సోమయ్య,మైనార్టీ నాయకులు ఎండి ఖాజా మొయినుద్దీన్, సొక్కం సోమన్న,సంగి బాలరాజు,ఎల్లారెడ్డి,విక్రమ్‌రెడ్డి,నోముల నర్సయ్య, చరణ్, సారయ్య, అన్వర్లతో పాటు సుమారు 1000 మంది యువకులతో పాటు ముఖ్య నాయకులకు ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మేకలు,గొర్రెల పెంపకందార్ల కార్పొరేషన్ చైర్మెన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.