Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ సాహితీవేత్త, దాశరధి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల
నవతెలంగాణ -రామన్నపేట
సొంత నిధులు వెచ్చించి మండలంలోని వెల్లంకి గ్రామంలో రూ.80 లక్షలతో కార్పొరేటు స్థాయిలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించి, గ్రామానికి అంకితం ఇచ్చిన సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డిని సోమవారం ప్రముఖ సాహితీవేత్త, మధురకవి, దాశరధి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య తన గ్రంథాలయ ఆవరణలో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గ్రామాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సర్పంచ్ మహేందర్ రెడ్డి కి సూచిస్తూ ఆశీర్వదించారు. గ్రామానికి, ప్రజలకు నిస్వార్ధంగా చేసే సేవలు సంతృప్తిని ఇవ్వడమే కాకుండా కీర్తి, ప్రతిష్టలను పెంపొందింపచేస్తాయని, చిరకాలం ప్రజల హృదయాలలో నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కృష్ణారెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, ఎడ్ల శ్రీధర్ రెడ్డి, పోలు చంద్రశేఖర్ రెడ్డి, ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, తాటిపాముల స్వామి పాల్గొన్నారు.