Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
దశాబ్దాల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవడం వల్ల ఉత్తేజాన్ని ఇవ్వడమే కాకుండా భావి జీవన ప్రణాళికకు ప్రేరణనిస్తాయని ప్రముఖ కవి, సాహితీవేత్త దాశరధి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య అన్నారు.మండలంలోని వెల్లంకి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలకు చెందిన 1992-1993 విద్యా సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నాటి గురువులు యాదగిరి, ఎం. ప్రభాకరశర్మ, అచ్యుతరెడ్డి, భిక్షపతి ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. వారికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక సందర్భంలో కన్నీటి పర్వంతమయ్యారు. తరగతి గదుల్లో చేసిన అల్లరిని జ్ఞాపకం చేసుకొని ఆనందించారు. తీపి జ్ఞాపకము బహుమతులను అందజేసుకొని, తరచూ ఇలాంటి సమ్మేళనాలను నిర్వహించుకోవాలని, చదువు నేర్చుకున్న పాఠశాలకు తోచిన విధంగా సదుపాయాలను కల్పించుటకు సహకరించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మడూరి వేణు గోపాల్ రావు, కందికట్ల భాస్కర్, ఆవనగంటి శ్రీనువాస్, సత్యనారాయణ రెడ్డి, వనం నర్సింహా, కొంగరి సద్గుణ, గుర్రం రమాదేవి, జీ పద్మ, పి రోజారాణి, పి సరిత, ఎం పద్మ, టీ రీత, కే కృష్ణారెడ్డి, ఏ సతీష్ రెడ్డి, టి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.