Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
హోలీ..హోలీల రంగహోలీ.. చమ్మకేలిలా హోలీ అంటూ... ఊరువాడ ప్రజలు హోలీ సంబురాలు అంబరాన్ని అంటాయి.రంగుల పండుగ కేరింతలు ఆనందోత్సవాల మధ్య మంగళవారం ప్రజలుహోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.మండలంలోని ఏ గ్రామంలో చూసినా,ఏ వీధిలో చూసిన హోలీ వేడుకలు కనువిందు చేశాయి.చిన్నారులు,యువతీ యువకులు,పెద్దలు రంగుల్లో మునిగి తేలారు.చిన్న పెద్ద కలిసి ఆడిపాడుతూ... రంగులు పూసుకుంటూ సందడి చేశారు.ఈ సందర్భంగా సోమవారం అర్ధరాత్రి కామదహనం కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవితా రాములుగౌడ్,ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ పులుసు యాదగిరిగౌడ్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్,బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి మల్లెపాక సాయిబాబా,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య,కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్,గ్రంథాలయ చైర్మెన్ గోపగాని రమేష్‌గౌడ్,పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్,వంశీ పాల్గొన్నారు.
చివ్వెంల: మండలవ్యాప్తంగా వాడవాడలో స్థానిక ప్రజా ప్రతినిధులు చిన్నారులతో కలిసి హోలీ సంబురాలు జరుపుకున్నారు.పలువురు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ హోలీపండుగ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపాలన్నారు..పలు కార్యక్రమాలలో గ్రామాలప్రజా ప్రతినిధులు,గ్రామస్తులు , చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ : మండలకేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో హోలీ వేడుకలు నిర్వహించారు.ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్ర మంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జెడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దొంగరి యుగంధర్, పీఏసీఎస్ చైర్మెన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, కోఆప్షన్ సభ్యులు షేక్ రఫీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లోని ప్రజలకుహోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అనాజీపురం సర్పంచ్ చెన్ను శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు గార్లపాటి స్వర్ణశ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో హోలీ పండుగను ప్రతిఒక్కరూ ఘనంగా నిర్వహించుకున్నారు.పట్టణంలోని ఆయ వార్డుల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు పాల్గొని పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ 9వ వార్డులో, తన కార్యాలయంలో డీఎస్పీ నాగభూషణం, కమిషనర్ పి.రామానుజులరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్,పట్టణంలోని 26వ వార్డులో, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితదేవి ఆనంద్ వారి నివాసంలో, బీఆర్ఎస్ జిల్లా నాయకులు మారిపెద్ది శ్రీనివాస్, గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో హోలీ సంబురాలు నిర్వహించుకున్నారు.
కోదాడరూరల్ : హోలీ పండుగ ప్రజలందరికీ జీవితాల్లో సరికొత్త వెలుగు నింపాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.తన క్యాంపు కార్యాలయంలో సంబురాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగస్తులు, ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితరాధారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
అర్వపల్లి :మండలకేంద్రంతో పాటు మండల పరిధిలో గ్రామాల్లో పిల్లలు మహిళలు పెద్దలు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు పలువురు నాయకులు ప్రతి ఒక్కరూ హౌలీ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు.సంబురాల్లో జెడ్పీటీసీ దావుల వీర ప్రసాద్‌యాదవ్,వారి కుటుంబ సభ్యులు,వీరితో పాటు పర్సాయపల్లి గ్రామ సర్పంచ్ పుప్పాల శేఖర్,టీపీటీఫ్ మండల అధ్యక్షుడు దబ్బెటి యాదగిరి, యేషబోయిన రాంబాబు, ఆవుల మధు,బానోత్ సైదులు,జీడి ఉపేందర్, సొనబోయిన వెంకన్న, మద్దేపురి మధు,నరేష్,సందీప్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని కుంచమర్తి గ్రామంలో ఎంపీపీ మన్నెరేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్ తన కుటుంబసభ్యులతో కలిసి హోలీ సంబురాలు జరిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉపేంద్రలింగరాజు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
నూతనకల్: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో హోలీ సంబురాలు నిర్వహి ంచారు.యువతి యువకులు, పెద్దలు కులమతాలకతీతంగా ఒకరికి ఒకరు రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాల నాయకులు, మహిళలు,బాలబాలికలు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : నేరేడుచర్ల వాసవి, వనితా క్లబ్‌ల ఆధ్వర్యంలో హోలీ సంబురాలు అంబరా న్నంటాయి.ఎస్ఆర్కె అపార్ట్‌మెంట్‌ను హోలీ సంబురాలకు వేదికగా ఎంచుకున్నారు.వనితా క్లబ్ వాసవి క్లబ్ సభ్యులు సంప్రదాయ బద్ధమైన రంగులు పూసుకుని సంబరాలు సరదా సరదాగా గడిపారు. వాసవి డిస్ట్రిక్ట్ చైర్మెన్ వంగవీటి గురుమూర్తి ఆయన సతీమణి శ్రీలక్ష్మి హోలీ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కాగా వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ రాచకొండ విజయలక్ష్మి జన్మదిన వేడుకలతో పాటు, అమెరికా దేశంలోని నార్త్ కరోలిన్ ఎన్ఆర్ఐ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సుధారాణి , వాసవి క్లబ్ సభ్యులు వీరమల్ల సత్యనారాయణ రాజ్యలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవాలను పురస్కరించుకొని వారిచే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.సేవా కార్యక్రమాలలో భాగంగా స్థానిక మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుడు మట్టయ్య సతీమణి కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్సగా పొందుతుండగా క్లబ్ తరపున రూ.10 వేలు , డిస్టిక్ క్యాబినెట్ సెక్రెటరీ రాచకొండ విజయలక్ష్మి జన్మదినాన్ని పురస్కరించుకొని రూ.8 వేలు, మరో నిరుపేద ఆర్యవైశ్య సభ్యులు సోమయ్య కుటుంబ పోషణకు క్లబ్ తరపున రూ.5 వేలు, రాచకొండ విజయలక్ష్మి రూ.2500 ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గరిణె అరుణ, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు పాల్వాయి రమేష్,మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కందిబండ వాసంతి, డిస్ట్రిక్ట్ ఇన్చార్జి రాచకొండ శ్రీనివాసరావు, వాసవి, క్లబ్‌ల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కొత్తా లక్ష్మణ్ వీరవెల్లి శ్రీలతా కోటేశ్వరరావు, గజ్జల కోటేశ్వరరావు, కోశాధికారి యీగా భాగ్యలక్ష్మి , క్లబ్ సభ్యులు మురారి శెట్టి రమేష్, గోళ్ళ సుధాకర్, ఊటుకూరు నటరాజ్, పాల్వాయి గోపాలకృష్ణ,వెంపటి వెంకన్న, గుండా సత్యనారాయణ, పీవిటీ,రాచకొండ రామకోటేశ్వరరావు ,గెళ్లి మహాలక్ష్మి ,ధనలక్ష్మి , కొత్తా పద్మ ,పావని, నర్మద, అనిత అరుణ,సద్గుణ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : పట్టణంలోని ప్రజలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సాంప్రదాయపరంగా జరిగిన హోలీ కార్యక్రమంలో పాల్గొని రంగులు చల్లుకొని హౌలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తిరుమలగిరి: మండలంలోని వివిధ గ్రామాల్లో హోలీ వేడుకలు నిర్వహించారు.ఉదయం నుండే యువకులు ప్రజలు ఒకరిపై ఒకరు రకరకాల రంగులు చళ్ళు కుంటూ వేడుకలు జరుపుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. సంబురాలతో పాటు భారీ ర్యాలీ నిర్వహించారు.మున్సిపల్ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా వైద్యాధికారి కోటాచలం, మున్సిపల్ వైస్‌చైర్మెన్ సంకేపల్లి రఘునందన్‌రెడ్డి,మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్‌కుమార్, కౌన్సిలర్లు బత్తుల శ్రీనివాస్,దుంపల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రామగౌడ్, కందుకూరు లక్ష్మయ్య, ప్రవీణ్, సంకేపల్లి నరోత్తంరెడ్డి, శ్రీనివాస్,కాంగ్రెస్ మండలఅధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు జలగం రామచంద్రంగౌడ్, కార్యదర్శి ఐతా శ్రీనివాస్, కోశాధికారి సురేష్, ఇమ్మడి వెంకటేశ్వర్లు, గుండా భాస్కర్ పాల్గొన్నారు.