Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలపరిధిలోని తొగర్రాయి గ్రామంలో ప్రాచీన రుక్మిణి సత్యభామ గోదాదేవి సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి వార్షిక కల్యాణబ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగు తున్నాయి. మంగళ వారం ఉదయం సంతానం లేని దంప తులు గరుడ్ణప్రసాదం అందించారు.వేద పండితులు నల్లాన్ చక్రవర్తుల రామ కృష్ణమాచార్య, దేవాలయ అర్చ కులు విష్ణువర్ధనాచార్య, పుల్లేశ్వరశర్మ, గ్రామ పురోహితులు రాకేష్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాత్రికి ఎదుర్కోలు దివిటీ ఉత్సవం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మెన్ అమరనాయిని వెంకటేశ్వరరావు, దేవాలయ ధర్మకర్తలు యాదా నర్సింహారావు, సురేష్, మహేశ్ దంపతులు దేవాలయ కమిటీ సభ్యులు లక్ష్మీనర్సింహాశాస్త్రి, హనుమంతరావు, సింగరయ్య, ఏడుకొండలు, గోపిరెడ్డి పాల్గొన్నారు.