Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
మహిళల భాగస్వామ్యంతోనే కార్యక్రమాలు విజయవంతమవుతాయని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావనికృపాకర్ అన్నారు.మంగళవారం మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జీషాపింగ్మాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు ప్రముఖ వైద్యురాలు దుర్గాభాయితో కలిసి ముఖ్యఅతిథిóగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. ముగ్గుల పోటీలతో మహిళల్లో ఉన్న సృజనాత్మకత బయటపడు తుందన్నారు.అనంతరం విజేతలు సట్టు హన్సిక (రూ.5 వేల చీర), తూటిపెల్లి అనూష (రూ.4 వేల చీర), తూటిపెల్లి భారతమ్మ (రూ.3 వేల చీర), తూటిపెల్లి అలివేలు (రూ.2 వేల చీర ), తూటిపెల్లి శైలజ (రూ. వెయ్యి చీర)లతో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 40 మందికి చీరలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్, దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు రాపర్తి మహేష్ కుమార్, కొరివి సతీష్, సట్టు పుష్ప, బంగారి చిన్నమల్లయ్య, లొడంగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.